- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: బీజేపీ లీడర్
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి మంగళవారం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన సమావేశంలో రాజ్యాంగాన్ని మారుస్తా అని వ్యాఖ్యలు చేయడం సరికాదని, దళితులకు రాజ్యాంగంతో ఏమి పని అనడం సరికాదన్నారు. దళితుల పట్ల ప్రేమ ఉంటే దళితుడిని సీఎం చేయాలని డిమాండ్ చేశారు.
దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న మాట ఎక్కడ పోయిందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నవ్ ఏమైంది అని ప్రశ్నించారు. దళితులను, ప్రజలను మోసపూరిత మాటలతో మోసం చేస్తున్నారని, ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. సీఎం కేసిఆర్ రాజ్యాంగాన్ని మారుస్తా అన్న మాట వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఇంచార్జీ శేఖర్, దళిత మోర్చ రాష్ట్ర నాయకుడు జగన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్థన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మహేందర్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు యశ్వంత్, ఓబీసీ మోర్చా కార్యదర్శి సురేందర్, కంది మండల అధ్యక్షుడు నర్సిహ్మారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహేష్, రాష్ట్ర నాయకుడు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.