శాండ్ బ్యాటరీస్‌.. గ్రీన్ ఎనర్జీ స్టోరేజీ సమస్యకు పరిష్కారం

by Manoj |
శాండ్ బ్యాటరీస్‌.. గ్రీన్ ఎనర్జీ స్టోరేజీ సమస్యకు పరిష్కారం
X

దిశ, ఫీచర్స్ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచంలో పెరిగిన ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఫిన్‌లాండ్‌ పరిశోధకులు పురోగతి సాధించారు. ప్రపంచంలోనే పూర్తిస్థాయిలో పనిచేసే మొట్టమొదటి శాండ్ బ్యాటరీని ఇన్‌స్టాల్ చేశారు. ఈ డెవలప్‌మెంట్ గ్రీన్ పవర్‌(సోలార్, విండ్)ను నెలల తరబడి నిల్వ చేయడం ద్వారా పునరుత్పాదక శక్తి(Renewable energy) స్టోరేజ్ సమస్యను పరిష్కరించగలదని పేర్కొన్నారు.

శాండ్ బ్యాటరీస్ ఎలా పని చేస్తాయి?

శాండ్ బ్యాటరీలు తక్కువ-గ్రేడ్ ఇసుకను ఉపయోగిస్తాయి. గాలి, సౌర శక్తి నుంచి ఉత్పత్తి చేయబడిన విద్యుత్తును వినియోగించుకుని బ్యాటరీలో ఇసుక వేడెక్కుతుంది. ఈ శక్తిని దాదాపు 500 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి రూపంలో నిల్వ చేయగలదు. ఈ ప్రైస్‌లెస్ పవర్‌ను గృహాలకు వెచ్చదనం కల్పించేందుకు ముఖ్యంగా శీతాకాలంలో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగించవచ్చు.'మేము స్వచ్ఛమైన విద్యుత్తుతో శాండ్ బ్యాటరీని వేడెక్కించి అక్కడ హీట్‌ను నిల్వ చేస్తాం. దాన్ని ఆ తర్వాత ఉపయోగించుకుంటాం' అని శాండ్ బ్యాటరీ డెవలపర్ టామీ ఎరోనెన్ వెల్లడించారు. ఫిన్లాండ్‌లో ఈ డెవలప్‌మెంట్ చాలా కీలకమైనది. ఎందుకంటే అక్కడి ప్రజలు దీర్ఘకాలం చల్లని శీతాకాలాలు ఎదుర్కొంటున్నారు.

'ఇది చాలా చవకైనది. నిజానికి నీరు వంటివి 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడిని నిల్వ చేయగలవు. కానీ ఇసుక 500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద వేడిని నిల్వ చేయగలదు. కాబట్టి ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాదు గణనీయమైన మొత్తంలో వేడిని చిన్న ప్రదేశంలో నిల్వ చేయొచ్చు' అని వటజాంకోస్కీ పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న పెక్కాపాసి తెలిపాడు.



Advertisement

Next Story

Most Viewed