Samantha: అఖిల్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు.. నిరాశలో సామ్ ఫ్యాన్స్

by samatah |   ( Updated:2022-04-09 06:15:10.0  )
Samantha: అఖిల్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు.. నిరాశలో సామ్ ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్ అంటే సమంత, నాగచైతన్యనే. వీరు తమ వైవాహిక బంధానికి స్వస్తిపలికిన విషయం తెలిసిందే. అయితే విడాకుల అనంతరం సామ్, చై ఇద్దరూ వారి వారి పనుల్లో బిజీ అయిపోయారు. ఇక ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్‌లో నాగచైతన్య ఫొటోస్ డిలీట్ చేసిన సామ్, ఇన్ స్టాగ్రాం‌లో నాగచైతన్యను అన్ ఫాలో చేసింది. కానీ అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్‌ని మాత్రం సామ్ ఫాలో అవుతూనే ఉంటుంది. అయితే శుక్రవారం అక్కినేని అఖిల్ బర్త్‌డే సందర్భంగా సామ్ ఆసక్తికర పోస్ట్ చేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకీ సామ్ ఏం చేసింది అనుకుంటున్నారా.. అఖిల్‌ పుట్టిన రోజు సందర్భంగా.. అఖిల్ నీకు హ్యప్పీ బర్త్‌డే, నువ్వు ఈ ఏడాది మంచి విజయాలు సాధించాలి. వరుస హిట్లతో దూసుకుపోయేలా.. దేవుడి ఆశీర్వాదం నీకు ఉండాలని సమంత పోస్ట్‌ చేసింది. కానీ సామ్ పోస్ట్‌పై అఖిల్ స్పందించలేదు. దీంతో సామ్ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు.

Advertisement

Next Story

Most Viewed