Salman Khan: థియేటర్‌లో మిస్టరీ గర్ల్‌తో సల్మాన్ ఖాన్...!

by S Gopi |   ( Updated:2022-04-14 06:31:47.0  )
Salman Khan: థియేటర్‌లో మిస్టరీ గర్ల్‌తో సల్మాన్ ఖాన్...!
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అమ్మాయిల్లోనే సల్మాన్‌కు ఫ్యాన్స్ ఎక్కువ. రీసెంట్‌గా సల్మాన్ ఓ థియేటర్ కు వెళ్లాడు. అప్పుడు అక్కడ పక్క సీట్లో కూర్చున్న ఓ అమ్మాయి సల్మాన్ ను అదే పనిగా చెంపకు చేయి పెట్టుకొని చూస్తూ ఉండిపోయింది. అది గమనించిన సల్మాన్ కూడా తనకు ఒక చిన్న చిరు నవ్వును విసిరాడు. ఈ సన్నివేశాన్ని క్లిక్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మందిని ఆకర్షిస్తుంది కూడా. ఈ ఫొటోను ఆ అమ్మాయి సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ పేజీల్లో(ట్వీట్టర్, ఫేస్ బుక్) పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. పెళ్లి గురించి గుడ్ న్యూస్ ఎప్పుడు చేబుతారు అంటూ.. అతని పెళ్లి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము అంటూ కామెంట్లు చేశారు.

Advertisement

Next Story

Most Viewed