- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవ హక్కుల మండలి నుంచి రష్యా సస్పెండ్
కీవ్: ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో జరిగిన పౌర హత్యలపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కీలక చర్యలు తీసుకుంది. దీనికి బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రష్యాను మానవ హక్కుల మండలి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తీర్మానం చేసింది. అయితే ఈ ఓటింగ్ కు భారత్ మరోమారు దూరంగా నిలిచింది. ఇప్పటికే పలుమార్లు జరిగిన ఓటింగ్ లోనూ ఇదే తరహా వైఖరి కనబరిచిన భారత్, దానినే కొనసాగించింది. కాగా, దీనికి 93 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయగా, 24 దేశాలు రష్యాకు అనుకూలంగా ఓటు వేయగా, 58 దేశాలు దూరంగా ఉన్నాయి.
బుచాతో పాటు కీవ్ చుట్టు పక్కల నగరాల్లో పౌర హత్యలకు రష్యా దళాలే పాల్పడ్డాయని ఉక్రెయిన్ సైనికులు ఆరోపించారు. ఈ దారుణ హత్యలకు నేపథ్యంలో ప్రపంచమంతా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు నిర్ణయించింది. అయితే మరోవైపు రష్యా మాత్రం తాము పౌరుల హత్యకు బాధ్యులం కాదని పేర్కొంది. ఉక్రెయిన్ అధికారులే ఉద్దేశ్యపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది.
రష్యా హత్యలను దాచిపెట్టింది: జెలెన్‌స్కీ
ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో పౌరులను రష్యన్ సైనికులు చంపారని అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్ స్కీ ఆరోపించారు. పోర్ట్ సిటీ మరియా పోల్‌లో వేల మందిని చంపి దాచిపెట్టిందని అన్నారు. అంతేకాకుండా మానవత్వ సేవలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసిందని అన్నారు. వారు పదుల సంఖ్య మారణకాండ చేయలేదని వేలల్లోనే ఈ సంఖ్య ఉందని తెలిపారు.
యుద్దాన్ని ఎంచుకున్న వారు ఎవరైనా అన్ని కోల్పోక తప్పదని గ్రీక్ పార్లమెంటుతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉద్దేశించి జెలెన్ స్కీ అన్నారు. మరియా పోల్‌ను విముక్తి చేసేందుకు యూరోపియన్ యూనియన్ మరిన్ని ఆంక్షలు ఉపయోగించాలని కోరారు. మరోవైపు ఉక్రెయిన్ సైనికులు ఫేస్ బుక్ ఖాతాలను లక్ష్యంగా చేసుకున్నారని మెటా పేర్కొంది.
43 లక్షల మంది దేశం విడిచారు..
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో 43 లక్షల మంది దేశం విడిచి వెళ్లారని ఐక్యరాజ్యసమితి గురువారం వెల్లడించింది. 43,19,494 మంది సరిహద్దుల గుండా ఇతర దేశాలకు వెళ్లారని ఐరాస తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇదే అతిపెద్ద యూరప్ శరణార్థుల సంక్షోభమని పేర్కొంది. అంతేకాకుండా మరో 71 లక్షల మంది దేశం లోపల నిరాశ్రయులు అయ్యారని తెలిపింది.
అదే సమయంలో 2.1 లక్షల మంది ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులు కూడా దేశం విడిచారని తెలిపింది. మరో వైపు ఉక్రెయిన్‌లోని పోర్ట్ నగరం మరియా పోల్‌లో మానవత సాయం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఇప్పటికే 90 ఆరోగ్య సదుపాయాలపై రష్యా దాడులు చేసినట్లు పేర్కొంది.
బుచా మరణాల దర్యాప్తుకు సహకరిస్తాం..
బుచాలో జరిగిన మారణకాండ స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపునిచ్చారు. బుచాలో జరిగిన దారుణ హత్యలను ఆయన ఖండించారు. అయితే ఈ హత్యలకు కారణమైన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చేందుకు రష్యా పూర్తి మద్దతు ఇస్తుందని భారత్ లోని రష్యా ఎంబసీ తెలిపింది. 'బుచా' లో జరిగిన ఘోరమైన దాడి రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన నాజీ నేరాల పీడకలలను గుర్తుకు తెస్తుంది. ఇది రష్యా, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకతను' పెంచింది అని ఓ ప్రకటనలో పేర్కొంది.