ఏడేళ్లుగా మాయమాటలు చెబుతున్న కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Vinod kumar |
ఏడేళ్లుగా మాయమాటలు చెబుతున్న కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, నకిరేకల్: ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ మాయమాటలతో కాలం వెళ్లదీస్తూ.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలంలోని ఒగోడు, గుడివాడ, ఉప్పల గూడా, భీమారం, తదితర గ్రామాల్లో మంగళవారం పాదయాత్ర చేపట్టి ఈ విధంగా మాట్లాడారు.


రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరు అన్నారు. ఎన్నికల ముందు అనేక ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెట్టి వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు మయమైందని.. పేద ప్రజలకు అన్ని ఇబ్బందులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.


ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు న్యాయం జరగకపోతే అత్యధికంగా బహుజన బిడ్డలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు గుడివాడ గ్రామంలో నియోజకవర్గ ఇన్చార్జి మేడి ప్రియదర్శిని తో కలిసి పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం ఒగోడు గ్రామంలో ఉపాధిహామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని.. వారితో పాటుగా కొద్దిసేపు కూలీ పనులు చేశారు.

Advertisement

Next Story