- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Venu Udugula: ఇలాంటి ప్రేమ కథను నేనెప్పుడూ వినలేదు.. దర్శకుడు వేణు ఉడుగుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల (Director Venu Uduga) నిర్మాతగా మారి తన తొలి నిర్మాణ సంస్థను అనౌన్స్ చేశారు. ఈ సంస్థలో తెరకెక్కుతున్న తొలి చిత్రాన్ని తాజాగా ప్రకటిస్తూ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) అనే టైటిల్‌ను ఫిక్స్ చెయ్యగా.. ఈ చిత్రంతో సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయం కాబోతునారు. ఇక రాహుల్ మోపిదేవి (Rahul Mopidevi)తో కలిసి డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఖమ్మం (Khammam), వరంగల్ (Warangal) బోర్డర్ నేపథ్యంలో సాగే ఈ మూవీ యదార్థ కథ ఆధారంగా తెరకెక్కింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడిన మూవీస్ ఎల్లప్పుడూ ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాగే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పుకొచ్చాడు నిర్మాత వేణు ఊడుగుల.
ఆయన మాట్లాడుతూ.. ‘కథ విన్న తర్వాత నాకు ఒక ఎక్స్ట్రార్డినరీ (Extraordinary) ఫీలింగ్ కలిగింది. ఎక్సైట్మెంట్ (excitement) వచ్చింది. కథలో ఉన్న ఎన్నో సెన్స్, కథ జరిగే ప్రాంతం, పాత్రలు, ఆ పాత్రల మధ్య సంఘర్షణ అన్ని నన్ను బాగా ఎట్రాక్ట్ చేశాయి. క్లైమాక్స్ మూడు రోజులపాటు నిద్రపోనివ్వలేదు. ఇంత వైవిధ్యమైనటువంటి ప్రేమ కథని నేనెప్పుడూ చూడలేదు వినలేదు. ఈ కథని సినిమాగా తీయాలని స్ట్రాంగ్ ఇంటెన్షన్‌తో ఈటీవీ విన్ వాళ్లతో షేర్ చేయడం జరిగింది. వాళ్లు కూడా కథ విని హ్యాపీగా ఫీలయ్యారు. ఈ కొలాబరేషన్‌తో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు టైటిల్ గ్లింప్స్ (Title Glimpses)ని రిలీజ్ చేశాం. ఇది మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న థియేటర్‌లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం.