బాలీవుడ్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన RRR

by GSrikanth |
బాలీవుడ్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన RRR
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సునామీ సృష్టిస్తోంది. కేవలం విడుదలైన మూడ్రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్లు చిత్ర యూనిట్ ఓ విడుదల చేసి ప్రకటిచించింది. తాజాగా.. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం అన్ని రికార్డులను చెరిపేస్తూ.. సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నది. బాలీవుడ్‌లోనూ.. ఈ చిత్రం మూడో రోజు భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. కరోనా పాండమిక్ తర్వాత బాలీవుడ్‌లోని ఏ చిత్రానికి ఇంత మొత్తంలో కలెక్షన్లు రాలేదని ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం మూడో రోజు 31.50 కోట్లను సాధించినట్లుగా తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం మొదటి రోజు 19 కోట్లు, రెండవ రోజు 24 కోట్లు, మూడవ రోజు 31.50 కోట్లు.. మొత్తంగా 74.50 కోట్లను ఈ చిత్రం ఇప్పటి వరకు వసూలు చేసినట్లుగా తరణ్ అధికారికంగా ప్రకటించారు.

Advertisement

Next Story