ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

by Disha News Desk |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
X

దిశ, నర్సాపూర్: నర్సాపూర్ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్ ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన సంఘటన నర్సాపూర్ సమీపంలోని కొండాపూర్ అటవీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల.. మృతులు గగిల్లాపూర్ గ్రామానికి చెందిన పవన్ కుమార్ (18), అక్షయ్ (20) లుగా గుర్తించారు. వారు గుమ్మడిదల నుంచి బైక్ పై నర్సాపూర్ వస్తున్నారు. ఈ క్రమంలో రాంపూర్ గ్రామానికి చెందిన రామ గౌడ్ నర్సాపూర్ నుంచి గుమ్మడిదల వైపు వెళుతున్నారు.

నర్సాపూర్ మండలంలోని కొండాపూర్ అటవీ ప్రాంతంలోకి రాగానే కారు, బైక్ ఢీకొన్నాయి. దీంతో పవన్ కుమార్, అక్షయ్‌లకు తీవ్ర గాయాలయాయి. వారిని వెంటనే చికిత్స కోసం అంబులెన్స్‌లో మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరు మృతి చెందారు. నర్సాపూర్ ఎస్‌ఐ గంగరాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పవన్ కుమార్ , అక్షయ్‌ల తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed