- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కార్మికుల పైనుంచి దూసుకెళ్లిన బస్సు
దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం రోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలి పనులు చేస్తున్న కార్మికుల నుంచి మృత్యు రూపంలో వచ్చిన ఆర్టీసీ బస్సు వారి ప్రాణాలను కబళించింది. వివరాల్లోకి వెళితే హెచ్ఎంటి కాంట్రాక్టు సంస్థ గత కొంత కాలంగా రాయగిరి-వరంగల్ రోడ్డు పనులు నడుస్తున్నాయి. అందులో భాగంగా ఆదివారం రోడ్డు పై ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తున్నటువంటి కూలీల పై నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న డీలక్స్ బస్సు దూసుకెళ్లడంతో అంకర్ల లక్ష్మీ, ఊరేళ్ళ శ్యామ్, అంకర్ల కవిత అక్కడిక్కడే మృతి చెందారు.
వీరి మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. అలాగే ఈ ప్రమాదంలో మరో 8 మంది గాయాల పాలయ్యారు. కార్మికులను ఢీ కొట్టిన అనంతరం అక్కడే పక్కకు ఆగి ఉన్న ట్రాక్టర్ను బస్సు ఢీకొనడంతో ట్రాక్టర్ మొత్తం నుజ్జునుజ్జయింది. మృతులంతా భువనగిరి మండలం రాయగిరి గ్రామానికి చెందిన వారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.