ఢీ కొన్న వాటిని తప్పించబోయి మరొకటి ఢీ.. ఒకరు మృతి..

by Vinod kumar |
ఢీ కొన్న వాటిని తప్పించబోయి మరొకటి ఢీ.. ఒకరు మృతి..
X

దిశ, ములుగు: ములుగు మండలం జంగాలపల్లి గ్రామ శివారులో గల ఎర్ర గట్టమ్మ సమీపంలో జాతీయ రహదారి 163 పై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. జాతీయ రహదారి 163 పై ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం, కారు ఢీకొనడంతో వాటి వెనకాల ఉన్న రెండు కార్లు ఢీకొన్న కారు, ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం జరిగింది.


ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం, మూడు కార్లు ప్రమాదానికి గురి అయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్ మృతి చెందగా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ములుగు ఎస్ఐ ఓంకార్, వెంకటాపురం ఎస్ఐ రాధిక ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని 108లో ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు. మృతుడు మెదక్ జిల్లా వాసిగా గుర్తించగా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story