టెస్టుల్లో రిషబ్ పంత్ సంచలనం.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్

by Mahesh |
టెస్టుల్లో రిషబ్ పంత్ సంచలనం.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
X

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ప్లేయర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. బెంగళూరు టెస్ట్ లో పంత్ అర్ధశతకం బాదడంతో చరిత్ర కెక్కాడు. ఈ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 26 బంతుల్లో 39 రన్స్ చేయగా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 28 బంతుల్లో 50 రన్స్ చేశాడు. దీంతో పంత్ 40 ఏళ్లుగా కపిల్ దేవ్ పేరుమీద ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 1982లో కపిల్ పాక్ తో జరిగిన టెస్ట్‌లో కేవలం 30 బంతుల్లో యాభై పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు దాన్ని పంత్ అదిగమించి టెస్ట్ క్రికెట్‌లో వేగవంతంగా 50 స్కోర్ చేసిన భారతీయ ఆటగాడిగా పేరు నమోదు చేసుకున్నారు. అలాగే 2021 లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 31 బంతుల్లో ఫిఫ్టీ బాదిన శార్దూల్ ఠాకూర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed