Rima Kallingal: తొడలు చూపిస్తూ డీసెన్సీ గురించి మాట్లాడుతున్నావా..? హీరోయిన్‌పై ట్రోలింగ్

by samatah |   ( Updated:2022-04-12 10:41:34.0  )
Rima Kallingal: తొడలు చూపిస్తూ డీసెన్సీ గురించి మాట్లాడుతున్నావా..? హీరోయిన్‌పై ట్రోలింగ్
X

దిశ, సినిమా : మలయాళ నటి, నిర్మాత రీమా కల్లింగల్ సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఏప్రిల్ 1 నుంచి 5 వరకు కొచ్చిలో జరిగిన రీజినల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఆమె.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత మంది మహిళలు పనిచేస్తున్నారు? వర్క్ ప్లేస్‌లో ఏవిధంగా సెక్సువల్ హరాస్‌మెంట్స్ ఎదుర్కొంటున్నారు? ఈ సమస్యలకు పరిష్కారాలతో పాటు వారు అందుకుంటున్న వేతనాల గురించి మాట్లాడింది. అయితే ఇంత పవర్‌ఫుల్ టాపిక్ మాట్లాడిన రీమ.. డెనిమ్ మినీ స్కర్ట్ అండ్ షర్ట్ ధరించడంపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు.

తొడలు చూపిస్తూ డీసెన్సీ గురించి మాట్లాడేందుకు బుద్ధిలేదా? ముందు పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి దుస్తులు ధరించాలో నేర్చుకో! ఎవరైనా ఆ తొడలపై క్లాత్ వేయండి' అంటూ నెగెటివ్ కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. అయితే నెటిజన్ల వ్యాఖ్యలపై స్పందించిన రీమ.. 'వీరు నన్ను లైంగికంగా వేధిస్తున్నారని ఎప్పుడు రియలైజ్ అవుతారో! అయినా ఇలాంటివి పట్టించుకుని టైమ్ వేస్ట్ చేసుకోలేను' అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ ఇష్యూపై ఇండస్ట్రీ నుంచి కూడా రీమాకు మద్దతు లభిస్తుండగా.. మాలీవుడ్ సెలబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇదే కావడం విశేషం.

Advertisement

Next Story