Rahul Gandhi: సీఎం ఆఫర్ ఇచ్చిన స్పందించలేదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Manoj |   ( Updated:2022-04-09 11:44:02.0  )
Rahul Gandhi: సీఎం ఆఫర్ ఇచ్చిన స్పందించలేదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయవతితో పొత్తు కూడేందుకు సీఎం పదవి ఇవ్వాలని చూసినా స్పందించలేని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల దర్యాప్తు ఒత్తిడిలో ఆమె ఉన్నారని ఆయన తెలిపారు. శనివారం ది దళిత్ ట్రూత్- బ్యాటిల్స్ ఫర్ రియలైజింగ్ అంబేద్కర్ విజన్ పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు.

'మీరు తాజా ఎన్నికల్లో మాయవతి ఎలాంటి పోరు చేయకపోవడం చూశారు. మేము మాయవతితో పొత్తుగా ఉందామని సందేశం పంపాం. సీఎంగా తనకే అవకాశమిస్తామని తెలిపాం. ఆమె కనీసం మాట్లాడలేదు. కానీ రామ్ జీ లాంటి వ్యక్తుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. వారు ఉత్తరప్రదేశ్ దళిత గొంతును నిద్రలేపారు. అయితే కాంగ్రెస్ కు నష్టం వాటిల్లింది అనేది వేరే విషయం. కానీ, నేడు మాయవతి వారి గొంతు కోసం పోరాటం చేయడం లేదని చెబుతుంది' అని రాహుల్ గాంధీ అన్నారు. అంతేకాకుండా సంస్థల ద్వారా రాజ్యాంగం అమలు చేయవచ్చని తెలిపారు. కానీ, వారు అన్ని సంస్థలను స్వాధీనం చేసుకున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తనకు దేశం అన్ని నేర్పిందని చెప్పారు. దేశం తనకు.. నేర్చుకుని, అర్థం చేసుకోవడం అలవాటు చేసిందన్నారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ ఘోర పరాజయం పాలయ్యాయి. ఇరు పార్టీల సీట్ల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది.

Advertisement

Next Story

Most Viewed