ఫ్యాన్స్‌కు రవితేజ బిగ్ ట్రీట్.. ఆ సినిమా రిలీజ్ ఫిక్స్..

by Javid Pasha |
ఫ్యాన్స్‌కు రవితేజ బిగ్ ట్రీట్.. ఆ సినిమా రిలీజ్ ఫిక్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ వరుస మాస్ మూవీస్‌తో అదరగొట్టేస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటిగా రవితేజ తన అభిమానులకు మాస్ ట్రీట్స్ ఇస్తున్నాడు. ఇటీవల 'ఖిలాడీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ప్రస్తుతం రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. మోస్ట్ ఎవెయిట్ మాస్ మసాలా మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ సినిమా 2022 జూన్ 17న థియేటర్లలో విడుదల కానుంది. మూవీ రిలీజ్‌తో అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ్ సీరియస్ లుక్స్‌తో కనిపిస్తున్నాడు. మరి ఈ మూవీతో రవితేజ తన ఏరేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed