Mega 154: మెగా మాస్ కాంబినేషన్.. చిరుతో రవితేజ షూటింగ్ స్టార్ట్

by S Gopi |   ( Updated:2023-12-17 14:57:21.0  )
Ravi Teja Joins Megastar Chiranjeevi, Bobbys Mega154
X

దిశ, సినిమా : Ravi Teja Joins Megastar Chiranjeevi, Bobby's 'Mega154'| మెగాస్టార్ చిరంజీవి, శ్రుతి హాసన్‌ జంటగా నటిస్తున్న సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి కాగా.. తాజాగా కిక్కిచ్చే అప్డేట్‌ ఇచ్చారు మేకర్స్. చిరుతో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక రోల్ చేయనున్నట్లు ఇదివరకే వార్తలు రాగా.. ఇందుకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు మేకర్స్. 'ద మాస్ ఫోర్స్ జాయిన్స్ ద మెగా స్టార్స్' క్యాప్షన్‌తో స్టార్ట్ అయిన టీజర్‌లో.. మూవీ షూటింగ్ జరుగుతున్న ప్లేస్‌కి రవితేజ కారులో వచ్చి.. కారవాన్ డోర్ కొట్టగానే చిరు షేక్ హ్యాండిచ్చి లోపలికి ఆహ్వానించాడు. ఆపై వెనుకనున్న డైరెక్టర్ బాబీ 'మెగా మాస్ కాంబో బిగిన్స్' అనడంతో టీజర్ క్లోజ్ అయింది.

ఇది కూడా చదవండి: ఫైట్ సీన్‌తో 'లైగర్' ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్

Advertisement

Next Story

Most Viewed