12ఏళ్లకే వర్జినిటీ కోల్పోయా.. రణ్‌వీర్ సింగ్

by Javid Pasha |   ( Updated:2022-03-31 12:51:08.0  )
12ఏళ్లకే వర్జినిటీ కోల్పోయా.. రణ్‌వీర్ సింగ్
X

దిశ, సినిమా: స్టార్ హీరో రణవీర్ సింగ్ తన 12ఏళ్ల వయస్సులోనే వర్జినిటీ కోల్పోయినట్లు వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. 'ఆ పని చేసినప్పుడు నాకు 12 ఏళ్లే. నా జీవితంలో ప్రతి ఒక్కటి కావాల్సిన దానికంటే ముందుగానే ప్రారంభించాను. అన్నింటిలో చాలా ముందున్నాను. ఎంతగా అంటే స్కూల్‌లో తల్లులందరూ వాళ్ల పిల్లలందరినీ పాడుచేసే 'కుళ్ళిన ఆపిల్‌'గా నన్ను పిలిచేవారు' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నాడు.

అలాగే పాఠశాలలో ఇతర అబ్బాయిలకు ఉపన్యాసాలు బోధించేవాడినని, అన్ని పనులు త్వరగా ప్రారంభించినందుకే మంచి నిపుణుడిని అయ్యానంటూ ఫన్నీగా మాట్లాడాడు. అంతేకాదు బాల్యంలోనే ఎన్నో ఇబ్బందులు పడ్డానన్న హీరో.. 2014లో కండోమ్ బ్రాండ్ కోసం ఒక ప్రకటనలో నటించానని, దాని ప్రమోషన్‌లో సెక్స్ రహస్యాలను వెల్లడించినట్టు చెప్పాడు. ఈ క్రమంలోనే ప్రజలు కూడా సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడటమే ఆరోగ్యకరమని తెలిపిన రణ్ వీర్ శృంగారాన్ని నిషిద్ధ విషయంగా చూడటం మానుకోవాలని సూచించాడు.

Advertisement

Next Story