దీపికపై ప్రశంసలు కురిపించిన రణ్‌వీర్.. 'గెహ్రాయియా' మాస్టర్ క్లాస్ అంటూ

by Disha Desk |
దీపికపై ప్రశంసలు కురిపించిన రణ్‌వీర్.. గెహ్రాయియా మాస్టర్ క్లాస్ అంటూ
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్ తన భార్య, నటి దీపికా పదుకొణె పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. ఆమె నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ 'గెహ్రాయియా' నిన్న విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో దీపికా ఒక ఆర్టిస్ట్‌గా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటూ ఆకాశానికెత్తేస్తున్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బీచ్‌లో దీపికను డీప్ లిప్ కిస్ చేస్తున్న ఫొటో షేర్ చేసిన హీరో.. గెహ్రాయియా సినిమాలోని 'దూబే.. హాన్ దూబే.. ఏక్ దూజే మే యాహాన్'.. అత్యద్భుతమైన ప్రదర్శన చేశావ్. నీకు అప్పగించిన పనిలో సంపూర్ణ మాస్టర్ క్లాస్ చూపించావ్ బేబీ. చాలా ఉత్తమమైన రోల్ పోషించావ్. నిన్ను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది' అంటూ క్యాప్షన్ ఇస్తూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. కాగా ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నీకు భార్య మీద ఉన్న ప్రేమను చూసి ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

https://www.instagram.com/p/CZ1m3zbBc4i/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story