లవ్‌ట్రాక్‌పై క్లారిటీ ఇచ్చిన హీరో రామ్

by GSrikanth |
లవ్‌ట్రాక్‌పై క్లారిటీ ఇచ్చిన హీరో రామ్
X

దిశ, సినిమా : సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ విషయాలు కొంచెం లీకైతే చాలు.. వాటికి ఉన్నవి, లేనివి కల్పించి నెగెటివ్‌గా ప్రచారం చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా హీరో రామ్ పోతినేనికి సంబంధించి ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. తను లవ్‌లో ఉన్నాడంటూ నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి. విషయానికొస్తే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన చిన్ననాటి స్నేహితురాలిని సీక్రెట్‌గా లవ్ చేస్తున్నాడని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కడం ఖాయమని సోషల్ మీడియా కోడై కూస్తోంది. కాగా ఈ రూమర్స్‌పై రీసెంట్‌గా క్లారిటీ ఇచ్చాడు రామ్. అసలు తాను ఎలాంటి రిలేషన్‌లో లేనంటూ, ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్న వారికి దండం పెట్టాడు. ఈ వార్తల వల్ల తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌కు కూడా తాను ఏ అమ్మాయిని ప్రేమించడం లేదని వివరణ ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed