Revanth Reddy: కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ భేటీ.. రాహుల్ గాంధీ వచ్చేది అప్పుడే?

by GSrikanth |   ( Updated:2022-04-15 07:52:36.0  )
Revanth Reddy: కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ భేటీ.. రాహుల్ గాంధీ వచ్చేది అప్పుడే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన రంజాన్ తర్వాత ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ నెలాఖరున రాష్ట్రానికి రావాల్సి ఉండగా వాయిదా పడినట్లు సమాచారం. ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్​ చేసే విధంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో నిరసన కార్యక్రమానికి హాజరవుతారని ముందుగా టీపీసీసీ చీఫ్ ప్రకటించారు. రాష్ట్రానికి వచ్చేందుకు రాహుల్ గాంధీ కూడా సుముఖత వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోవడంతో ఈ నిరసనలు ఆగిపోయాయి. కాగా, ధరల పెరుగుదలతో పాటు పలు అంశాలపై వచ్చేనెల వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఈ సభకు రాహుల్ గాంధీ రానున్నట్లు చెప్పుతున్నారు. అనుకున్నట్టే మే 3న రంజాన్ పర్వదినం ముగిసిపోతే ఈ వెంటనే మే 4 న రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారని పార్టీ నేతలు వెల్లడించారు. మే 4 న వరంగల్‌ సభకు హాజరవుతారని, మే 5 న హైదరాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో భేటీ కానున్నారని, ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం నుంచి ప్రాథమికంగా సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల కిందటే ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి.. రాహుల్​పర్యటనపైనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. అయితే, రాహుల్ పర్యటనపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు.

Advertisement

Next Story

Most Viewed