- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్‌నే ప్రకటించిన బీజేపీ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో సీఎం అభ్యర్థిపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. మరోసారి పుష్కర సింగ్ ధామి వైపే అధిష్టానం మొగ్గుచూపింది. తాను ఓడినప్పటికీ, పార్టీని గెలిపించడంలో చేసిన కృషికి మరో సారి సీఎంగా ప్రకటించారు. దీంతో దేవభూమిలో పుష్కర్ సింగ్ వరుసగా రెండోసారి సీఎం బాధ్యతలు చేపట్టనున్నారు. డెహ్రాడూన్‌లో సోమవారం కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నేత మీనాక్షి లేఖీ సమక్షంలో జరిగిన శాసనసభ్య సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. కాగా, సీఎం బాధ్యతలు కొంత కాలమే నిర్వహించిన ధామి తనదైన శైలిలో పార్టీని ముందుండి నడిపించారు.
ఈ వైఖరే పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు ధామికి ప్రధానమంత్రి మోడీ తో పాటు ఆరెస్సెస్ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉండటం కూడా కలిసొచ్చే అంశంగా మారింది. కాగా, ఆదివారం ప్రధాని తో జరిగిన సమావేశంలో ఇది ఖరారైనట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్ రావత్, ఖండూరీ వంటి ప్రముఖుల పేర్లు వినిపించిన చివరికి పుష్కర్ సింగ్ మరోసారి సీఎం కానున్నారు.