- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆప్ ప్రభుత్వం 'బచ్ఛా పార్టీ'.. హర్యానా మంత్రి సంచలన వ్యాఖ్యలు
చండీగఢ్: పంజాబ్‌లో చండీగఢ్‌ను చేర్చాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ తీర్మానంపై హర్యానా మంత్రి అనిల్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ఆప్ ప్రభుత్వాన్ని బచ్చా పార్టీ (చిన్నపిల్లల పార్టీ)గా అభివర్ణించారు. ఆ పార్టీకి సమస్యలపై పూర్తి అవగాహన లేదని ఆరోపించారు. పంజాబ్‌లో భగవంత్ మాన్ ప్రభుత్వం బాల్య దశలో ఉందని, దీని పాల దంతాలు ఇంకా పోలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బచ్ఛా పార్టీ.
దానికి సమస్యలపై పూర్తి అవగాహన లేదు' అని పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై మాట్లాడారు. మన్ ప్రభుత్వం చండీగఢ్ సమస్యను లేవనెత్తిందని విజ్ ఆరోపించారు. 'చండీగఢ్ సమస్య ఉంది. దానికి అనుసంధానంగా మరికొన్ని ఉన్నాయి. సుట్లేజ్ యమునా అనుసంధాన కాలువ, హిందీ మాట్లాడే ప్రాంతాలు వంటి సమస్యలు ఉన్నాయి. వారు వీటిపై మాట్లాడలేదు. ఎప్పుడు ఏ నిర్ణయం వచ్చినా అది ఒక్కటే అవుతుంది. భిన్నమైన నిర్ణయాలు ఉండకూడదు' అని అన్నారు. అంతేకాకుండా ఆప్ పంజాబ్ సాధించింది విజయం కాదని, అది కొందరు ప్రముఖుల ఓటమి అని పేర్కొన్నారు.