789 రైతు కుటుంబాలకు సహాయం చేశాం: Bhagwant Mann

by Javid Pasha |   ( Updated:2022-08-06 13:33:10.0  )
Punjab Government Gave Financial Aid to Families of 789 farmers who died in protest, Says CM Bhagwant Mann
X

దిశ, వెబ్‌డెస్క్: Punjab Government Gave Financial Aid to Families of 789 farmers who died in protest, Says CM Bhagwant Mann| రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 789 రైతు కుటుంబాలకు అండగా నిలిచిందని, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేసిందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ తెలిపారు. శనివారంతో రైతులకు ఆర్థిక సహాయం చేయడాన్ని ప్రభుత్వం పూర్తి చేసుకుందని వెల్లడించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై చేసిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేసిందని, ఆ కార్యక్రమం శనివారంతో ముగిసిందని భగవంత్ తెలిపారు. రాష్ట్రంలో నిరసనల్లో భాగంగా ప్రాణాలు విడిచిన ప్రతి రైతు కుటుంబానికి రూ.5 లక్షల చొప్పు మొత్తం రూ.39.55 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వెల్లడించారు. రైతులు, వారి కుటుంబాలను రక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, అందులో భాగంగానే రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రస్తుత వ్యవసాయ సంక్షోభం నుంచి ప్రతి రైతును గట్టెక్కించేందుకు తమ ప్రభుత్వ కట్టబడి ఉందని, ఇప్పటికే రైతులకు ప్రత్యామ్నాయ పంటలను తెలిపిందని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: దేశరాజధానిలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ

Advertisement

Next Story