- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైరెక్టర్ లేకుండానే మూవీ ఓపెనింగ్.. స్టార్ ప్రొడ్యూసర్ పోస్ట్
దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ మోస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో 'ఒక్కడు' ముందు వరుసలో ఉంటుంది. గుణశేఖర్ దర్శకత్వంలో యాక్షన్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. పదిహేను కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై, విడుదల తర్వాత నిర్మాతలకు అంతకు రెండింతల లాభాల్ని తెచ్చిపెట్టింది. అంతేకాదు మహేష్ కెరీర్‌లోనే ఈ సినిమాను తొలి కమర్షియల్ హిట్‌గా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ మూవీ గురించి మాట్లాడేందుకు నిర్మాత ఎంఎస్. రాజు ఆదివారం షేర్ చేసిన ఆసక్తికర పోస్ట్ కారణం.
2002 మార్చి 14న 'ఒక్కడు' మూవీ పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లోని తన ఆఫీస్‌లో నిర్వహించినట్లు తెలిపిన ఎంఎస్ రాజు.. అప్పటి ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అదే టైమ్‌లో గుణశేఖర్ అరకులో షూటింగ్ ప్రారంభించారని, పూజ అయిపోగానే మహేష్ వెంటనే అరకువెళ్లి షూటింగ్‌లో పాల్గొన్నాడని తెలిపాడు. దీంతో మహేష్ అంకితభావంపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
March 14th 2002 Superstar @urstrulyMahesh babu's blockbuster Okkadu puja opening at my hyd office...same time @Gunasekhar1 garu started shooting at Araku valley...after pooja myself & babu went to Airport to join shoot for the historic chase pic.twitter.com/zrkRFQsMRT
— MS Raju (@MSRajuOfficial) July 17, 2022