- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయనతో స్నేహం ఓ వెచ్చని కౌగిలి.. డేటింగ్ రూమర్స్‌పై ప్రియాంక క్లారిటీ
దిశ, సినిమా: ప్రముఖ హిందీ టెలివిజన్ నటి ప్రియాంక చాహర్ చౌదరి డేటింగ్ రూమర్స్‌పై స్పందించింది. నటుడు అంకిత్ గుప్తాతో కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ప్రియాంక.. తనతో కలిసున్న ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ క్రమంలో ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అంకిత్ కేవలం స్నేహితుడు మాత్రమే అని, తనతో బంధం ఓ వెచ్చని కౌగిలిలాంటిదని అభివర్ణించింది. అలాగే ఆయన లాంటి వ్యక్తిని కలిగి ఉండటం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాన్న నటి.. ఉన్నతమైన ప్రదర్శననిచ్చేందుకు ప్రోత్సహిస్తూనే ఉంటాడని తెలిపింది. 'నా సహనటుడు తెలివైనవాడు. మా మధ్య సన్నివేశాలన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. దానికి అనుగుణంగానే మీరు స్పందించవచ్చు. అయితే డేటింగ్ పుకార్లను పరిష్కరించడానికి తనతోనే ఎక్కువ సమయం గడిపాను. కానీ, మేము ప్రేమలో ఉన్నామని అర్థం కాదు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక డేటింగ్ గాసిప్‌ల వల్ల తానెప్పుడూ ఇబ్బంది పడలేదన్న బ్యూటీ.. అభిమానులు తమపై ప్రేమను చూపించడానికి ఇది ఒక మార్గంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేసింది.