టీసీ కావాలంటే... మేం ఎంత అడిగితే అంత ఇవ్వాలి..

by S Gopi |
టీసీ కావాలంటే... మేం ఎంత అడిగితే అంత ఇవ్వాలి..
X

దిశ, పిట్లం: పిట్లం మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో అధిక ఫీజుల దందా కొనసాగుతుంది. ఫీజుల కొరకు తరచుగా వేధిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదివిన విద్యార్థులకు టీసీ ఇవ్వమంటే అధిక ఫీజు చెల్లించాలని వేధిస్తున్నారు. యాజమాన్యం మొండివైఖరితో వ్యవహరించడంతో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. కరోనా సమయంలో కూడా ఫీజులు చెల్లించాలని విద్యార్థులకు వేధించారు. టీసీలు ఇవ్వమంటే అధిక ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామని మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు, టీసీలు, బోనఫైడ్లు ఇవ్వడంలో రోజుల తరబడి పాఠశాల చుట్టూ తిప్పుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిట్లం గ్రామానికి చెందిన అనుమ లిఖితకు సంబంధించిన టీసీ, బోనాఫైడ్ ఇచ్చే విషయంలో తమను పాఠశాల చుట్టూ నెల రోజుల నుంచి తిప్పుతున్నారని లిఖిత తండ్రి అశోక్ బాధను వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed