Prabhas: గుడ్ న్యూస్ ప్రకటించిన ప్రభాస్.. వైరల్‌గా మారిన పోస్ట్

by Hamsa |
Prabhas: గుడ్ న్యూస్ ప్రకటించిన ప్రభాస్.. వైరల్‌గా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) భారీ చిత్రాలను లైనప్‌లో పెట్టారు. షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉంటున్న డార్లింగ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండటం లేదు. ప్రజెంట్ రాజాసాబ్(Rajasab), స్పిరిట్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా, ప్రభాస్ గుడ్ న్యూస్ ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. యువ రచయితలకు, డైరెక్టర్స్‌కు బంపర్ ఆఫర్(Bumper Offer) ఇచ్చారు. ప్రభాస్ అన్న ప్రమోద్‌తో కలిసి స్క్రిప్ట్ క్రాఫ్ట్ అనే సంస్థను స్టార్ చేసినట్లు సమాచారం.

ఈ విషయాన్నే ఆయన షేర్ చేస్తూ.. ‘‘మీ దగ్గర కథలు ఉన్నా అవకాశం రావట్లేదా మీ లాంటి వాళ్ళ కోసమే ఒక వెబ్‌సైట్‌(website)ను తీసుకొస్తున్నాము. ఆ వెబ్‌సైబ్‌లో మీ కథను లేదా సినాప్సిస్‌ని అప్లోడ్ చేస్తే ఆడియన్స్ వాటికి రియాక్ట్ అవుతారు. అలా ఎక్కువ రియాక్షన్స్ వచ్చిన స్టోరీని సినిమాగా తెరకెక్కిస్తాము’’ అని తెలిపారు. ప్రజెంట్ డార్లింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story