పోస్టాఫీసు RD పథకంతో చేతికి రూ.16 లక్షలు..

by Disha Desk |
పోస్టాఫీసు RD పథకంతో చేతికి రూ.16 లక్షలు..
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్బుపై అధిక రాబడి పొందాలంటే దీర్ఘకాలిక పెట్టుబడి అవసరం. మంచి లాభాల కోసం ప్రజలు ఎక్కువగా బ్యాంకులలో FD చేస్తారు. కానీ వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లు కూడా మంచి రాబడి అందిస్తాయి. పైగా దీనిలో పెట్టుబడి పెట్టడం వలన పెద్దగా రిస్క్ కూడా ఉండదు. అటువంటి పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఒకటి ప్రస్తుతం అందుబాటులో ఉంది. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతాలో రూ. 10,000 నెలవారీ పెట్టుబడితో 10 సంవత్సరాలలో రూ.16 లక్షల వరకు సంపాదించవచ్చు.

పోస్టాఫీసు RD పథకంలో ప్రతి నెలా రూ. 10,000 పెట్టుబడి పెడితే, 10 సంవత్సరాల తర్వాత మొత్తం మెచ్యూరిటీ పై రూ. 16.28 లక్షలు లభిస్తాయి. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతాపై వడ్డీ రేటు సంవత్సరానికి 5.8 %గా ఉంది.

పెట్టుబడి: ప్రతి నెల రూ. 10,000

వడ్డీ: 5.8%

మెచ్యూరిటీ: 10 సంవత్సరాలు

10 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం: రూ. 16,28,963

Advertisement

Next Story