'బాహుబలి 3' హీరోయిన్ నేనే : పూజా హెగ్డే

by Mahesh |   ( Updated:2022-03-21 11:31:55.0  )
బాహుబలి 3 హీరోయిన్ నేనే : పూజా హెగ్డే
X

దిశ, సినిమా: పూజా హెగ్డే నటించిన తాజా చిత్రం 'రాధే శ్యామ్' అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా భారీ వసూళ్లు మాత్రం రాబట్టింది. ఇదిలావుంటే.. తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన పూజ.. 'రాధే శ్యామ్' సినిమాకుగాను తనపై వచ్చిన నెగెటివ్ కామెంట్స్‌తో పాటు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మేరకు అందరి జీవితాల్లో నెగిటివ్, పాజిటివ్ అనేవి కామన్ అని చెప్పిన పూజ.. రెండింటినీ మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ముందుకు సాగుతానని తెలిపింది.

ఈ క్రమంలోనే ప్రభాస్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ఆయన చాలా మంచి వ్యక్తి అని, అవకాశముంటే 'బాహుబలి-3'లో తనకు జోడిగా తీసుకోమని చెబుతానంటూ చెప్పుకొచ్చింది. ఇక పూజ వ్యాఖ్యలతో 'బాహుబలి 3' కూడా ఉండబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో 'బాహుబలి' మూడో పార్ట్ ఉండబోతోందని డైరెక్టర్ రాజమౌళితో పాటు ప్రభాస్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story