- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలక్షన్లకు ముందే మొదలైన ప్రచారం.. దేన్నీ వదలట్లేదుగా..!
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలొస్తున్నాయంటే చాలు పార్టీలన్నీ తమదైన శైలిలో జోరుగా ప్రచారం చేస్తూ ఓటర్లను వశం చేసుకుంటుంటారు. అన్ని వర్గాల నుంచి ఓట్లు రాబట్టేందుకు మేనిఫెస్టోను సిద్ధం చేసి ప్రచారం చేస్తుంటారు. అయితే, గుజరాత్‌లో ఎన్నికలు రాకముందే ప్రచారం మొదలెట్టేశారు అక్కడి పార్టీ ప్రతినిధులు. అయితే, అందరిలా గొడుగులు పంచడం, గోడ గడియారాలను పంచకుండా వినూత్నంగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. తినుబండారాలను ఇంటింటికీ సప్లై చేసి ఓట్లు సంపాదించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేతలు.. అక్కడి ఓటర్లకు బీజేపీ, మోడీ స్టిక్కర్లతో కూడిన తినుబండారాలను పంచుతూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ గుజరాత్‌లో గెలిచేందుకు కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.