రాజన్న ఆలయంలో రాజకీయ భజన.. వివాదాస్పదంగా ఆలయ ఈవో ప్రవర్తన

by Disha News Desk |
రాజన్న ఆలయంలో రాజకీయ భజన.. వివాదాస్పదంగా ఆలయ ఈవో ప్రవర్తన
X

దిశ, వేములవాడ టౌన్: దక్షిణ కాశిగా ప్రసిద్ధి గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్న దర్శన భాగ్యం పేద భక్తులకు శాపంగా, పెద్దలకు వరంగా మారింది. ఆలయ అధికారులు రాజకీయ నాయకులకు ఇతర ప్రముఖులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల క్యూలైన్లలో సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు సుమారు 8 నుండి 10 గంటల సమయం రాజన్న దర్శనం కోసం నిరీక్షించారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదానం, మంచినీటి పంపిణీ, వాటర్ ఫ్రిడ్జ్, మజ్జిగ ప్యాకెట్లు దాతలు అందించారు. ఆలయంలో సుమారు పది లక్షల రూపాయలతో పూలతో అలంకరణ కు కూడా దాతలు ముందుకు వచ్చారు.

ఉచిత వైద్య సేవలు కూడా నిర్వహించారు. ఆలయ అధికారులు మాత్రం షరా మామూలే అన్నట్టు వ్యవహరిస్తూ.. సామాన్య భక్తులకు రాజన్న దర్శనం అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చి, రాజన్న మొక్కులు చెల్లించుకుందామంటే సరైన వసతి లేక క్యూలైన్ లో గంటల తరబడి నిలబడి, నిరీక్షించి ఇక్కట్లు పడ్డారు. దీనిపై పై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి లో దర్యాప్తు జరిపించి.. అధికారులపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు గడప కిషోర్ రావు, నాగుల రాములు గౌడ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed