- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి హత్య కుట్ర కేసు నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు
దిశ, కుత్బుల్లాపూర్: రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ హత్యకు కుట్ర కేసు నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వివరాల ప్రకారం... రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో ఏడుగురు నిందితులను జైలుకు పంపిన విషయం తెలిసిందే. అయితే కేసు విచారణలో భాగంగా పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీ కోరడంతో కోర్టు అనుమతినిచ్చింది. గత నెల 26న నలుగురు, రెండు రోజుల తర్వాత మిగతా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం రాఘవేందర్ రాజు, నాగరాజు, విశ్వనాథరావు, యాదయ్య, రవి, మధుసూదన్ రాజు, అమరేందర్ రాజులను కస్టడీకి తీసుకున్నారు. ఈనెల 13 వరకు విచారణ కొనసాగనుంది. ఇదిలా ఉండగా చర్లపల్లి నుండి పీఎస్ కు తీసుకురావాల్సి ఉంది. కానీ ముందుగా అల్వాల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తదనంతరం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు మధ్యాహ్నం 1.45 గంటలకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య తీసుకువచ్చారు. విచారణ కొనసాగనున్నట్లు తెలిసింది.