పోలీసుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. స్టేషన్ ఎదుట మైనారిటీల ధర్నా

by GSrikanth |
పోలీసుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. స్టేషన్ ఎదుట మైనారిటీల ధర్నా
X

దిశ, మెట్‌పల్లి: మెట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ముస్లింలు ధర్నా నిర్వహించారు. ఓ యువకుని హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, సకాలంలో కేసు దర్యాప్తు చేస్తే ఈ ఘటన చోటు చేసుకునేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన అబ్దుల్ సోహెల్(19) గత సెప్టెంబర్ 4న ఇంటినుండి వెళ్ళిపోయాడు. రెండ్రోజుల తరువాత(సెప్టెంబర్ 6న) యువకుడి కుటుంబ సభ్యులు మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన యువకుడు హత్యకు గురైనట్లు గుర్తించిన సోమవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ రవీందర్ రెడ్డి బాధితులతో మాట్లాడి కేసుపై పూర్తి దర్యాప్తు జరుపుతామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. అనంతరం డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Next Story