- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృద్ధిరాలిపై రిటైర్డ్ ఏఎస్ఐ నిర్వాకం.. వృద్ధాశ్రమం పేరుతో భార్యతో కలిసి ఘోరం
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో పిల్లలు తల్లిదండ్రులపై కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలను కని, పెద్ద చేసి, సరైన స్థానంలో నిలబెట్టే తల్లిదండ్రులను చివరికి శోకమే మిగులుతుంది. ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా చూసుకోవాల్సిన కన్న వాల్లే పేగు బంధం మరచి తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్నారు. మరీ కొందరైతే మా వల్ల కాదని తల్లిదండ్రులను అనాథ ఆశ్రమంలో విచిడిపెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఆ వృద్ధుల ఎక్కడికి వెళ్లాలో తెలియక రోధన అనుభవిస్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు ఆశ్రమాలు నిర్మించి వృద్ధులను కాపాడుకుంటుంటే, మరికొందరు వృద్ధులను చిత్ర హింసలకు గురిచేసి, వాళ్ల వద్దనున్న కాస్త డబ్బులను కూడా లాక్కుంటున్నారు. ఇలాంటి ఓ సంఘటనే కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్దతడూరు గ్రామానికి చెందిన గంగవ్వ అనే వృద్ధురాలు పిల్లలు సరిగా చూసుకోవడం లేదని వృద్ధాశ్రమమంలో చేరడానికి వెళ్లింది. కోడ్చిరా గ్రామ శివారుల్లోని చెన్నమకోరి దేవస్థానం వద్ద ASI గా పనిచేసి పదవీ విరమణ పొందిన బాలకృష్ణాచారి నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో చేరింది. దీంతో గంగవ్వ వద్దనున్న బంగారం, డబ్బు చూసి బాలకృష్ణాచారి ఆలోచన విధానం మారిపోయింది. ఎలా అయినా వాటిని తన వశం చేసుకోవాలనే ప్లాన్‌లో పడ్డాడు. బాలకృష్ణాచారి, అతని కొడుకు శివచారి, భార్య భారతమ్మలు పథకం వేసుకున్నారు. ఆ పథకం ప్రకారమే ''నీ వద్ద ఉన్న బంగారం, డబ్బు ఎవరైనా దోచుకుంటారు. అవి మాకు ఇవ్వు. నువ్వు వెళ్లేటప్పుడు తిగిరి ఇస్తాము.'' అని గంగవ్వకు మాయమాటలు చెప్పారు. వారి మాటలు నమ్మిన గంగవ్వ సరేనని మూడు తులాల బంగారు చైన్, 1 లక్ష 20 వేల రూపాయలు నగదు వారికి అప్పగించింది.
అయితే ఒకరోజు గంగవ్వ ఆ బంగారం, డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగింది. దీంతో ఏఎస్ఐ కుటుంబ సభ్యులు దబాయింపు చర్యలకు పాల్పడ్డారు. మాకేప్పుడు ఇచ్చావంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఇలా బుకాయించడమే కాక గంగవ్వను బెదిరింపులకు గురిచేశారు. దీంతో ఆందోళన చెందిన గంగవ్వ ఏం చేయాలో తెలియక వాళ్ల పిల్లలకు చెప్పింది. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. మాజీ ఏఎస్ఐ బాలకృష్ణాచారి గంగవ్వ వద్ద నుంచి మోసపూరితంగా తీసుకున్న బంగారాన్ని, బాలాజీ మహాజన్ అనే వ్యక్తి వద్ద తనఖా పెట్టి డబ్బు తీసుకొని తమ సొంత అవసరాలకు వాడుకునట్లు దర్యాప్తులో తేలిందని ఎస్ఐ శికుమార్ తెలిపారు. దీంతో వారిని అరెస్టు చేసామని ఎస్ఐ తెలిపారు.