దంపతులపై దాడి కేసును ఛేదించిన పోలీసులు

by Vinod kumar |   ( Updated:2022-03-11 17:13:54.0  )
దంపతులపై దాడి కేసును ఛేదించిన పోలీసులు
X

దిశ, చింతలమనేపల్లి: మండలంలోని గంగపూర్ గ్రామానికి చెందిన ఎల్కారి అంజన్న అతని భార్య మౌనిక కాగజ్ నగర్ నుండి గంగపూర్ కి తేదీ రోజున 20-09-2021 వెళ్తుండగా.. ఆడేపల్లి శివారు అడవి ప్రాంతంలో వారిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి మౌనికను తీవ్రంగా గాయపర్చారు. దీంతో బాధితులు తేదీ 2-09-2021 రోజు పిర్యాదు చేయగా కౌటలా సీఐ బుద్దే స్వామి విచారణ చేపట్టి సెల్ ఫోన్ డేటా, సీసీటివి పుటేజీ ఆధారంగా కేసును ఛేదించారు. భార్య మౌనిక పై భర్త ఎల్కారి అంజన్న, అతని చిన్నమ్మ కొడుకు మహేష్ లు కలసి పథకం ప్రకారం దాడి చేసి చంపాలని హత్య ప్రయత్నం చేశారు.


అయితే గాయపరచి మౌనిక బ్రతిమిలాడేసరికి ట్రాక్టర్ రావడం గమనించి ఆమెను చంపకుండా వదిలేసి ఆమెను బెదిరించి వేరేవారు దాడిచేసినట్లు నాటకామడారు. కానీ భర్త, భార్యను చంపాలని ముందే ఆమెపై ఇన్సూరెన్స్ కూడా చేయించాడు. తరువాత ఆమెను చంపాలని పథకం వేసి.. అతని తమ్ముడు మహేశ్ తో కలసి ఆమెపై దాడి చేసినారు. ఈ రోజు వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని సీఐ కౌటలా బుద్దే స్వామి తెలిపారు.

Next Story