- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రెస్, ఆర్మీ, పోలీసులకు హై అలర్ట్.. రసవత్తరంగా మారిన ఫైన్ల ప్రక్రియ
దిశ, తెలంగాణ బ్యూరో: వాహనాలపై ఉండే స్టిక్కర్ల వ్యవహారం రాష్ట్రంలో వివాదమవుతోంది. స్టిక్కర్లు ఉంటే ఫైన్ వేస్తామని బహిరంగ ప్రకటనలు లేకుండా, కనీసం అవగాహన కల్పించకుండా ఉన్నపళంగా జరిమానా పుస్తకాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ కనిపించిన వాహనాలను ఆపి ఫైన్లు వేస్తున్నారు. ఇటీవల ప్రెస్(PRESS) అనే స్టిక్కర్ ఉన్న వాహనానికి రూ.700 ఫైన్ విధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు వాహనాలపై వేసిన స్టిక్కర్లపై పోలీస్‌శాఖ అప్రమత్తమవుతోంది. పోలీసులు వినియోగించే వాహనాలకు సైతం స్టిక్కర్లను తొలిగిస్తున్నారు. పోలీస్ స్టిక్కర్లను తొలిగిస్తున్న ఫోటోను హైదరాబాద్ట్రాఫిక్పోలీస్ట్విట్టర్లో మంగళవారం ట్వీట్‌చేశారు. ఓ మహిళా ఎస్ఐ వాహనానికి ఉన్న స్టిక్కర్‌ను తొలిగించే ఫోటోను విడుదల చేశారు.
మార్చి టార్గెట్ కోసమేనా..?
ఇప్పటికే ట్రాఫిక్నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు ఫొటోగ్రాఫర్లుగా మారారు. రోడ్డు మధ్యలో ఉండి వాహనాలపై విచ్చలవిడిగా జరిమానాలు వేస్తున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు. తాజాగా స్టిక్కర్లు ఉంటే జరిమానాలు వేస్తూ పోలీస్ శాఖ తరుపున ఆదాయాన్ని పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ట్రాఫిక్ నిబంధనలపై ఎంతో కొంత ప్రచారం చేస్తున్న పోలీస్ శాఖ.. ఈ స్టిక్కర్ల అంశాన్ని మాత్రం ఎలాంటి ప్రచారం లేకుండానే జరిమానాలకు దిగింది. వాహనాలను తనిఖీ చేస్తూ కొన్నిచోట్ల ఫైన్లు వేస్తుంటే.. ట్రాఫిక్ పోలీసులు మాత్రం వాహనాల ఫొటోలు తీసి ఆన్లైన్లో జరిమానా విధిస్తున్నారు. ఈ మార్చి నెలాఖరు వరకు దండియా ఆదాయాన్ని పెంచుకునేందుకే పోలీసులు ఇలా ఉన్నపళంగా ఫైన్లు వేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సుప్రీం కోర్టు ఆదేశాలు, పోలీసులు తీసుకునే చర్యలను ఎక్కడా ప్రచారం చేయలేదు. ఇటీవల జరిగిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ కారు వ్యవహారాన్ని సాకుగా చూపిస్తూ ఈ ప్రక్రియకు దిగినట్లు పోలీసులు చెప్పుతున్నారు.
మరోవైపు గతంలో వాహనాలపై ఇలాంటి స్టిక్కర్లను చూసి పోలీసులు కొంత ఉదారంగా వ్యవహరించిన సంఘటనలున్నాయి. అయితే, కొన్నిచోట్ల అనర్హులు, నకిలీగాళ్లు ఇలా తమ వాహనాలపై ప్రెస్, పోలీస్, ఆర్మీ, లీడర్ అంటూ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారని, సరైన గుర్తింపు కార్డు చూపించకుంటే వాటిపై చర్యలు తీసుకుంటామని గతంలో ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఎవరు స్టిక్కర్వేసినా ఫైన్లు తప్పవంటూ చెప్పుతున్నారు. ఈ క్రమంలోనే 'PRESS' స్టిక్కర్లతో రోడ్డెక్కిన వాహనాలను గుర్తించి రూ.700 ఫైన్స్ వేస్తున్నారు. అయితే, ప్రభుత్వం జర్నలిస్టుగా గుర్తించి అక్రిడేషన్ కార్డు ఉన్నప్పటికీ ప్రెస్ స్టిక్కర్ వేసుకోనివ్వారా? అంటూ పోలీసులను నిలదీస్తున్నారు. పోలీసులు మాత్రం ఎవరికైనా జరిమానా వేస్తామని చెప్పుతున్నారు. అంతేగాకుండా తమ వైపు నుంచి కూడా పోలీసులు స్పందించి 'POLICE' స్టిక్కర్ తొలిగిస్తున్నారు.