- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Asaduddin Owaisi: 'అగ్నిపథ్' వెనక్కి తీసుకోవాల్సిందే: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: Asaduddin Owaisi Demands Central Government To Take Agnipath Scheme Back| కేంద్ర ప్రభుత్వం సైనిక నియామకాల కోసం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ దేశవ్యాప్తంగా సెగలు రేపుతోంది. ఆర్మీ అభ్యర్థులు, ప్రతిపక్ష రాజకీయ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులు చేస్తోన్న నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన విధంగానే.. అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా తప్పుడు నిర్ణయం అని.. దీని వలన దేశానికి ఏ మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. ఆర్మీ, నేవీ అధికారులను ప్రధాని మోడీ కాంట్రాక్ట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్ల్ లాగా భావిస్తున్నారని.. కానీ సైనిక వృత్తి గౌరవప్రదమైనదని కేంద్రానికి గుర్తు చేశారు.
- Tags
- Asaduddin Owaisi