Petrol Price.7 రోజుల్లో 6వ సారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.

by Mahesh |   ( Updated:2022-03-28 06:27:25.0  )
Petrol Price.7 రోజుల్లో 6వ సారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.
X

దిశ, వెబ్ డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్రం ఇంధన ధరల రోజువారీ నియంత్రణ పై ఉన్న ఆంక్షలు ఎత్తి వేసింది. దీంతో ఇంధన కంపెనీలు రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నారు. వరుసగా ఏడు రోజుల్లో ఆరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 112.71, డీజిల్ రూ.99.08 గా ఉంది. అలాగే విజయవాడ లో లీటర్ పెట్రోల్ రూ. 114.64, డీజిల్ రూ.100.63 గా ఉంది.

Advertisement

Next Story