- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెట్రోల్‌కు బదులు నీళ్లు... షాకైన వాహనదారులు (వీడియో)
దిశ, మానోపాడు: ఉండవెళ్లి మండలంలోని బొంకూరులోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కి బదులు వాటర్ రావడం కలకలం రేపింది. కేజీఎస్ పెట్రోల్ బంకులో ఉదయం వాహనదారులు 10 మంది వరకు పెట్రోల్ కొట్టించుకున్నారు. వాహనదారులకు కాసేపటికే మార్గమధ్యలో వాహనాలు ఆగిపోవడంతో తిప్పలు పడ్డారు. మెకానిక్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించగా ఆశ్చర్యానికి గురయ్యారు. బండిలో పెట్రోల్ కి బదులు వాటర్ ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు.
ఏమి చేయాలో తెలియక, తిరిగి పెట్రోల్ బంకుకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. ఖాళీ బాటిల్, బకీటలలో పట్టి చూడాలని వాహన దారులు పట్టుబడటంతో సగానికి పైగా నీళ్లు, పెట్రోల్ వచ్చాయి. అయితే అప్పటికే జరిగిన పొరపాటును గ్రహించిన బంకు సిబ్బంది, పెట్రోల్ ను ఫిల్ చేయడం తాత్కాలికంగా నిలిపివేశారు. తప్పిదం కారణంగా ఆగిపోయిన వాహనాలను రిపేర్ చేయిస్తామని బంకు యజమాన్యం హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో వాహనదారులు కొంతవరకూ శాంతించారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ వాహనదారులు మండిపడ్డారు. అయితే, పెట్రోల్ బంకు యాజమాన్యం మాత్రం పెట్రోల్ లో ఎలాంటి నీటిని కల్తీ చేయలేదని, వర్షాల దృష్ట్యా ఇలా ఇంకిపోయి ఉంటాయని వాపోయారు.