- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంగూలీతో మాట్లాడుతా..!: పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా
కరాచీ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా నాలుగు దేశాల క్రికెట్ టోర్నమెంట్‌పై మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు. ఆస్టేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్ జట్లను కలిపి వన్డే సిరీస్‌లో ప్లాన్ చేయాలని రమీజ్ గతంలో ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఐసీసీలోని సభ్యదేశాల కంటే ఈ నాలుగు దేశాల క్రికెట్ బోర్డులకు ఆదాయం భారీగా పెరుగుతుందని రజా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇదే విషయంపై మార్చి 19న దుబాయిలో జరగనున్న ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని కలిసి తన ప్రతిపాదనను వినిపిస్తానని చెప్పాడు. ఒకవేళ గంగూలీ తన ఆలోచనతో ఏకీభవించకపోతే.. మిగతా దేశాలతో కలిసి త్రైపాక్షిక సిరీస్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని రమీజ్ రజా పేర్కొన్నాడు. ఇదిలాఉండగా రమీజ్ ప్రతిపాదనను బీసీసీఐ సెక్రటరీ జై షా గతంలోనే కొట్టి పారేశాడు.
త్వరలోనే పాక్ మహిళల పీఎస్ఎల్ :
భారత్‌లో ఐపీఎల్ లాగా పాకిస్తాన్ కూడా తమ దేశంలో పీఎస్ఎల్ టోర్నీని నిర్వహిస్తోంది. ఇండియాలో ఫురుషులతో పాటు మహిళా క్రికెటర్ల కోసం కూడా ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుండగా.. పాక్‌లో కూడా మహిళా క్రికెటర్ల కోసం పీఎస్ఎల్ నిర్వహించేందుకు యోచిస్తున్నట్టు రమీజ్ రజా వెల్లడించాడు.వచ్చే జనవరిలో టోర్నీని ప్రారంభిస్తామని విదేశీ క్రికెటర్లకు కూడా ఇందులో అవకాశం కల్పిస్తామన్నారు.