- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'గే' అని తెలియడంతో కుక్కను వదిలేసిన ఓనర్..
దిశ, ఫీచర్స్ : 'గే' కష్టాలు మనుషులకే కాదు కుక్కలకు కూడా తప్పేట్లు లేవు. స్వలింగ సంపర్కులని తెలిస్తే కన్న బిడ్డల పట్ల కూడా కర్కశంగా వ్యవహరించే హ్యూమన్ సొసైటీ.. మూగ జీవాలపైనా అదే రకమైన కాఠిన్యాన్ని ప్రదర్శించడం చర్చకు దారితీస్తోంది. ఒక యజమాని తాను పెంచుకుంటున్న శునకంలో 'గే' లక్షణాలున్నాయని యానిమల్ షెల్టర్ హౌస్‌లో వదిలేసిన సంఘటన హార్ట్ బ్రేకింగ్‌గా మారింది.
యూఎస్, నార్త్ కరోలినాలో 'ఫెజ్కో' పేరు గల శునకం, మరో మగ కుక్కతో లైంగిక కోరిక తీర్చుకోవడాన్ని(హంపింగ్) యజమాని గమనించాడు. ఆ తర్వాత ఫెజ్కోను స్టాన్లీ కౌంటీలోని రీహోమింగ్ షెల్టర్‌లో వదిలేసి వెళ్లినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. అయితే మరో కొత్త యజమాని దొరికే వరకు ఈ శునకాన్ని సంరక్షణలోకి తీసుకోవాలని సదరు యానిమల్ సెంటర్.. లోకల్ రెస్క్యూ సెంటర్స్‌ను కోరుతోంది. నాలుగేళ్ల వయసు, 50 పౌండ్ల బరువుండే ఫెజ్కో ఎప్పుడూ జనాల చుట్టూ ఉండేందుకు ఇష్టపడుతుందని లోకల్ టీవీ స్టేషన్ WCCB షేర్ చేసిన పోస్ట్‌లో వెల్లడించింది. ఇక ఈ పోస్ట్ చదివిన చాలామంది.. ప్రేమగా పెంచుకున్న కుక్కను అలా వదిలేసిన యజమాని నిర్ణయాన్ని ఖండిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఏదేమైనా చాలావరకు కుక్కల్లో.. ఇతర జంతువులు, వ్యక్తులు లేదా వస్తువులతో హంపింగ్, హస్తప్రయోగం వంటి చర్యలు సాధారణ ప్రవర్తనేనని అమెరికన్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానమిల్స్' పేర్కొంది. తమ కుక్కల్లో ఇలాంటి ప్రవర్తన నచ్చనివారు.. బొమ్మలు ఇవ్వడం, గేమ్స్ ఆడటం లేదా సిట్, షేక్ వంటి ప్రాథమిక విధేయత నైపుణ్యాల్లో నిమగ్నం చేయడం ద్వారా వాటి దృష్టిని మరల్చమని ఈ సంస్థ ప్రోత్సహిస్తోంది.