- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య చమురు ధరల భయాలు!
దిశ, వెబ్‌డెస్క్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు కు సంబంధించిన ఆందోళనలు పెరుగుతున్నాయి. మంగళవారం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు ఏకంగా 97.76 డాలర్లకు చేరుకోవడంతో ఇది మరింత భయాలను పెంచుతోంది. తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర ప్రదేశాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా ప్రకటించడం, దీనిపై ప్రపంచ దేశాలు ఆగ్రహించడం వంటి పరిణామాల మధ్య ముడి చమురు ధరలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి.
దీంతో ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్‌లకి అత్యంత చేరువలో ఉన్న నేపథ్యంలో పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని గ్లోబల్ ఆయిల్ బ్రోకర్లు అంటున్నారు. ఇప్పటికే కరోనా సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత మళ్లీ పెట్రోల్, డీజిల్ వినియోగానికి డిమాండ్ పుంజుకుంటోంది. ఈ సమయంలో రష్యా-ఉక్రెయిన్ పరిస్థితుల వల్ల పెట్రోలియం ఎగుమతి దేశాలు, ఒపెక్ ప్లస్‌గా పిలువబడే మిత్ర దేశాలు చమురు సరఫరాను పెంచేందుకు ఆలోచిస్తున్నాయి.
ప్రపంచంలోనే సౌదీ తర్వాత అత్యధికంగా చమురును ఎగుమతి చేసే దేశం రష్యానే. అంతేకాకుండా ఎక్కువ సహజవాయువు కూడా రష్యా నుంచే ఎగుమతి అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యాపై ఏ విధమైన ఆంక్షలు విధించినా అంతర్జాతీయంగా చమురు ఎగుమతులపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. మరోవైపు, దేశీయంగా ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న కారణంగా ఇంధన ధరలు పెంచలేదని, మార్చి మొదటివారంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయిల్ కంపెనీలు లీటర్‌కు రూ. 8-10 వరకు ధరలు పెంచే అవకాశం ఉందని డెలాయిట్ ఇండియా అభిప్రాయపడింది.
ఇప్పటికే ధరల్లో మార్పు చేయాల్సి ఉండగా, ఎన్నికల వల్ల పెంచలేదని డెలాయింట్ పేర్కొంది. ఇదే సమయంలో చమురు ధరలు పెరగడం వల్ల ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐకి కూడా ఇబ్బందులుంటాయని డెలాయిట్ అభిప్రాయపడింది. దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు ఇంకా పెరుగుతాయని, ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం మధ్య ఇది ఇంకా తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని డెలాయిన్ వెల్లడించింది.