- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Diwali: దీపావళి నాడు లక్ష్మీదేవికి-గణేశుడికి సమర్పించాల్సిన నైవేద్యాలు..!!
దిశ, వెబ్‌డెస్క్: అత్యంత పవిత్రమైన పండుగల్లో దీపావళి(Diwali:) ఒకటి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగ వాతావరణం నెలకొంది. గణపతి పూజ కోసం(Ganpati Puja), లక్ష్మీ దేవి పూజ(Lakshmi Devi Puja) కోసం కావాల్సిన సామాగ్రిని అంతా సిద్ధం చేసుకున్నారు. దీపావళి రోజున సంపదలకు దేవతైన అమ్మవారిని ఎంతో నిష్ఠతో పూజిస్తారు. లక్ష్మీవారికి భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. శ్రేయస్సు లభిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద పండగ అయిన దీపావళి నాడు దీపాలను వెలిగిస్తారు. బాణాసంచా కాలుస్తారు. అయితే వీటితో పాటు దీపావళి రోజు లక్ష్మీదేవికి, వినాయకుడికి కొన్ని పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తే ఇంట్లో అంతా శుభమే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అమ్మవారికి-వినాయకుడికి పెట్టాల్సిన నైవేద్యాలు..
దీపావళి నాడు గణపతికి, అమ్మవారికి కుంకుమ పువ్వును పాలలో వేసి నైవేద్యంగా పెడితే శుభం జరుగుతుంది. వీటితో పాటుగా తీపి పదార్థాలు (sweets)కూడా సమర్పించాలని జ్యోతిష్య పండితులు(astrologers) చెబుతున్నారు. అలాగే అమ్మవారికి ప్రీతికరమైన గులాబ్ జామ్(Gulab Jam), మోతీచూర్ లడ్డూ(Motichur laddu), కోవా(cova), బర్ఫీ(barfi), కొబ్బరి(coconut), తాజా పండ్లు(fresh fruits), తమలపాకులు(betel leaves), సీతాఫలం(sitaphala), అరటిపండ్లు(bananas), పూల్ మఖానా(pool makhana), శనగపిండి లడ్డూ(gram flour laddu) అమ్మవారికి, వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి.
ఏ నైవేద్యం దేనికి..?
సీతాఫలం లక్ష్మీదేవికి సమర్పిస్తే ఇంట్లో సంపద, శ్రేయస్సు కలుగుతుంది. అరటిపండు అంటే వినాయకుడికి ఇష్టమైన పండు. కాగా అరటిపండును శుభప్రదమైన పండుగా పండితులు చెబుతున్నారు. ఇక పూల్ మఖానా సంపదకు చిహ్నంగా చెబుతారు. వినాయకుడికి ప్రీతికరమైన శనిగపిండితో తయారు చేసిన లడ్డూ నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ కుటుంబానికి మేలు జరుగుతుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.