- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ జాతీయ రహదారికి తొలగిన అడ్డంకులు
దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గం నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న 167 జాతీయ రహదారికి అడ్డంగా ఉన్న మందిరాలు, సమాధులు తొలగించేందుకు నారాయణపేట ఆర్డిఓ రామచందర్ ఆర్ అండ్ బి ఇంజనీర్ సత్యప్రకాష్, కాంట్రక్టర్, అఖిలపక్ష నాయకులు, ఆయా గ్రామాల కమిటీ వాళ్ళతో కూర్చోని చర్చించి మార్గం సుగమం చేశారు.
వాటి వివరాలు ఇలా ఉన్నాయి
జడ్చర్ల నుంచి కర్ణాటక రాయచూరు వైపు వెళ్తున్న 167 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మక్తల్ మండలం లో గుడిగండ్ల గ్రామం దగ్గర సమాధి, దేవాలయాలను మరోచోట నిర్మాణం చేయడానికి స్థలం చూపించు నిర్మాణ ఖర్చులు చెల్లిస్తే తొలగిస్తామన్నారు. కాచువార్ గ్రామం దగ్గర ఉన్న సమాధిని తొలగించడం డ్రైనేజి మురుగు నీరు జాతీయ రహదారి అండర్ డ్రైనేజీ సిస్టంగా తీసుకెళ్తే రోడ్ వెంబడి గా ఉన్న నివాస గృహాలకు డ్రైనేజి మురుగు నీటి ముప్పు రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు రూల్ విధించారు.
మక్తల్ పట్టణంలో చెరువు కట్ట కింద ఉన్న ఈదమ్మ గ్రామదేవత చెరువు కట్టపై పునర్ నిర్మి చాలని, చెరువు దిగువ భాగంలో కట్ట మైసమ్మ మందిరాన్ని నిర్మించాలని.. అతి పురాతనమైన నల్లజానమ్మ మందిరం కాంపౌండ్ వాల్ ఆర్చి ద్వారం నిర్మాణం కు నగదు, భూమికి పరిహారం చెల్లించాలని షరతు విధించారు. ఇది ఇలా ఉండగా అతి పురాతనమైన మక్తల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రజలకు ఆరాధ్య దైవంగా కొలిచే పడమటి ఆంజనేయ స్వామి మందిరం ముందు ఉన్న నాగుల కట్ట వద్ద డ్రైనేజీ తీసుకెళ్తూ గుడి స్థలానికి ఎలాంటి ఆటంకం కలగకుండా రోడ్డు పనులు చేసుకోవచ్చు. ఆలయ కమిటీ తో ఆర్డీఓ ఒప్పందం చేసుకున్నారు.
దీంతోపాటు చందాపూర్ గ్రామంలో బీరప్ప మందిరం పునర్నిర్మించడానికి స్థలం. డబ్బులు ఇస్తే తొలగించడానికి సిద్ధమని ఆ గ్రామస్తులు తెలిపారు. జాతీయ రహదారి కొన్ని అడ్డంకులు తొలగిపోవడంతో మందిరాలను గడువులోపు పూర్తి చేయాలని ఆర్డీవో కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనులనుపర్వెక్షించాలని తహశీల్దార్ రాణప్రతాప్ సింగ్‌ను ఆర్డీవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీహరి, బీజేపీ నాయకులు మల్లికార్జున్, రాజశేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి, టీడీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి, ఆంజనేయులు, శ్యామ్, ధార్మిక సంస్థ నాయకులు సత్యనారాయణ, భీమ్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.