వెజ్ ఆర్డర్ చేస్తే నాన్‌వెజ్.. రూ. 20వేలు జరిమానా

by Manoj |
వెజ్ ఆర్డర్ చేస్తే నాన్‌వెజ్.. రూ. 20వేలు జరిమానా
X

దిశ, ఫీచర్స్ : బిజీ లైఫ్‌లో చాలామంది ఆన్‌లైన్ ఫుడ్‌పై ఆధారపడుతున్నారు. కుకింగ్ చేసుకునే టైమ్ లేకపోవడంతో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ఇక ఆ ఫుడ్ అయినా కరెక్ట్‌గా ఆర్డర్ చేసింది వస్తుందా? అంటే అదీ లేదు. వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్.. నాన్ వెజ్ ఆర్డర్ చేస్తే వెజ్. అలాంటప్పుడు నాన్ వెజ్ తినే వారికి అయితే పరవాలేదు.. కానీ, ప్యూర్ వెజ్‌టేరియన్స్‌కి నాన్‌వెజ్ వస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి సంఘటనే గ్వాలియర్‌కు చెందిన దంపతులకు ఎదురుకావడంతో సదరు రెస్టారెంట్‌కు రూ. 20వేల జరిమాన విధించబడింది.

గ్వాలియర్‌ నగరంలో నివసించే న్యాయవాది సిద్ధార్థ్ శ్రీవాస్త.. పాపులర్ జివాజీ క్లబ్ నుంచి మటర్ పనీర్ లబబ్దార్ వెజ్ ఫుడ్‌ను ఆర్డర్ చేసుకున్నారు. కానీ చికెన్ కర్రీ డెలివరీ అయింది. దీంతో షాక్‌కు గురైన సభ్యులు కన్స్యూమర్ ఫోరమ్‌లో పిటీషన్ వేశారు. దీంతో కేసును విచారించిన ఫోరమ్.. ఇది వారి మానసిక, శారీరక మనోభావాలను దెబ్బతీసిందని.. జివాజీ క్లబ్ కిచెన్ తమ నిర్లక్ష్యాన్ని యాక్సెప్ట్ చేసి రూ.20వేల జరిమానా చెల్లించాలని పేర్కొంది. అంతేకాదు ఫిర్యాదుదారు ఫోరమ్ కేసుకు సంబంధించిన ఖర్చులకు కూడా సదరు రెస్టారెంట్ బాధ్యత తీసుకోవాలంటూ తీర్పిచ్చింది.

Advertisement

Next Story