- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఐఎస్ఐ మార్క్ లేని ఉత్పత్తులను ఈ-కామర్స్ సంస్థలు వెంటనే తొలగించాలి'!
న్యూఢిల్లీ: దేశీయంగా ఉన్న ఈ-కామర్స్ సంస్థలు తమ వెబ్‌సైట్ల నుంచి ఇకపై ఐఎస్ఐ ఆర్క్ లేని అన్ని రకాల ఉత్పత్తులను తీసివేయాలని వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారిచేసింది. ఈ మేరకు ప్రధాన ఈ-కామర్స్ కంపెనీలతో జరిగిన సమావేశంలో మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఐఎస్ఐ లేని, నాణ్యత, నకిలీ ఐఎస్ఐ గుర్తు ఉన్న వస్తువులు, ముఖ్యంగా హెల్మెట్లు, ప్రెషర్ కుక్కర్‌లను ఈ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదల అవుతుందని దని తెలిపింది. దీని తర్వాత ఈ-కామర్స్ కంపెనీలు నాణ్యత లేని వస్తువులను విక్రయిస్తున్నట్టు గుర్తిస్తే భారీ జరిమానాను కట్టాల్సి ఉంటుంది.
ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రిత్వ శాఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం సహా పలు కంపెనీలతో సమావేశం నిర్వహించింది. తక్షణనే ఐఎస్ఐ గుర్తింపు లేని వస్తువులను తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తీసేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఇటీవల పేటీఎం తన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో ఐఎస్ఐ మార్క్ లేని ప్రెషర్ కుక్కర్‌ను విక్రయించినందుకు వినియోగదారు వ్యవహారాల శాఖ సంస్థపై రూ. లక్ష జరిమానా విధించింది.