- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదేనా కార్పొరేషన్ అభివృద్ధి..?
దిశ, జవహర్ నగర్: ప్రయాణం సాఫీగా జరగాలంటే వాహనాలు ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా రోడ్లు ఉండాలి. రోడ్ల వలన రవాణా వ్యవస్థ మెరుగుపడి ఆ ప్రాంత ప్రగతికి దోహదపడుతుంది. అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం దినదినాభివృద్ధి చెందుతూ..హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న జవహర్ నగర్ కార్పొరేషన్ పై దృష్టి సారించాలి. హైదరాబాద్ నగరంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో పెరుగుతున్న వాహనాల రాకపోకల వలన ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా జవహర్ నగర్ కార్పొరేషన్ లో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లింక్ రోడ్లకు ప్రాధాన్యత ఏదీ..?
కార్పొరేషన్ పరిధి భౌగోళిక ప్రాంతం 24.18 చ.కి.మీటర్లతో సుమారు రెండు లక్షలకు పైగా జనాభా విస్తరించి ఉంది. కార్పొరేషన్ పరిధిలో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్లాలంటే నరకయాతన తప్పడంలేదు. గల్లి రోడ్ల కంటే అధ్వానంగా మారిన లింకు రోడ్లపై దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉంది. బాలాజీ నగర్ నుండి వికలాంగుల కాలనీ, సీపీఐ కాలనీ (వీ కే ఎంక్లేవ్), మహంకాళి రోడ్డు, బాబు జగ్జీవన్ రావ్ రోడ్డు (శ్రీరామ్ నగర్ రోడ్డు), సంతోష్ నగర్ రోడ్డు, బీజేఆర్ నగర్ రోడ్డు, గబ్బిలాల పేట్ రోడ్డు, శాంతి నగర్ రోడ్డు, నోబుల్ స్కూల్ పక్కన రోడ్డు లు ప్రస్తుతం అస్తవ్యస్తంగా 30 పీట్ల వెడల్పు మట్టి రోడ్లు ఉన్నాయి. ఇలాంటి లింక్ రోడ్లపై అధికారులు పాలకులు దృష్టి సారించాల్సి ఉంది.
అంతా అయోమయం: బీజేపీ
కార్పొరేషన్ సుందరీకరణ చెందడంలో విశాలమైన రోడ్లు ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. కార్పొరేషన్ అభివృద్ధిలో ఇంజనీరింగ్ విభాగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పెరుగుతున్న జనాభా దృష్ట్యా వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ ఇక్కట్లు అధిగమించాల్సిన ఆవశ్యకతను గుర్తించి రవాణా వ్యవస్థను మెరుగుపరిచే ప్రణాళికలను చేయాల్సి ఉంటుంది. కార్పొరేషన్ పరిధిలో రోడ్ల నిర్మాణం, నాణ్యత, రవాణా సౌకర్యాలు వంటి అంశాలపై అవగాహనతో రోడ్ల అభివృద్ధి పనుల కోసం ప్రణాళికలు చేస్తారు. కానీ ఇదంతా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఇలాంటివి ఏమీ ఉండవు, ఇలాంటి ముందస్తు ఆలోచన లేకుండా కనీస అవగాహన లేకుండా ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. లింకు రోడ్లలో వాహనాల రాకపోకలతో ఇబ్బందులు లేకుండా విశాలమైన రోడ్లు వేసేందుకు అనుకూలంగా ఉన్నా వాటిపై దృష్టి సారించకపోవడం అధికారుల నిర్లక్ష్యం ఏంటో స్పష్టమవుతుంది. కార్పొరేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీ, సీపీఐ కాలనీ (వీకే ఎంక్లేవ్), మహంకాళి రోడ్డు, బాబు జగ్జీవన్ రావ్ రోడ్డు (శ్రీరామ్ నగర్ రోడ్డు), సంతోష్ నగర్ రోడ్డు, బీజేఆర్ నగర్ రోడ్డు, గబ్బిలాల పేట్ రోడ్డు, శాంతి నగర్ రోడ్డు, నోబుల్ స్కూల్ పక్కన రోడ్డు లు ప్రస్తుతం అస్తవ్యస్తంగా 30 పీట్ల వెడల్పు మట్టి రోడ్లులు ఉన్నా... కేవలం 12 ఫీట్లు వెడల్పు సీసీ రోడ్లు వేస్తూ అధికారులు, కాంట్రాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. విశాలంగా ఉన్న రోడ్లలలో కేవలం 12 ఫీట్ల వెడల్పు రోడ్డు వేయడంతో వాహనదారులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇదంతా ఇంజనీరింగ్ విభాగం అవగాహన రాహిత్యం వల్లే అస్తవ్యస్తంగా ప్రణాళికలు చేస్తున్నారన్న బీజేపీ ఆరోపించింది. ఇప్పటికైనా పాలకులు అధికారులు ముందస్తు ఆలోచనలతో వెడల్పు రోడ్లు వేస్తూ.. కార్పొరేషన్ ను అభివృద్ధి పథంలో నడిపేందుకు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.