- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MP Arvind: ఎంపీ ధర్మపురి అర్వింద్ షాకింగ్ డెసిషన్.. షాక్‌లో బీజేపీ శ్రేణులు
దిశ, వెబ్‌డెస్క్: Nizamabad MP Arvind Says, He Won't Criticize CM KCR| తెలంగాణ రాజకీయంలో పరిచయం అక్కర్లేని పేరు ధర్మపురి అర్వింద్. రాజకీయ కురు వృద్ధుడు డి.శ్రీనివాస్ తనయుడిగా కంటే బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా ఎక్కువ పేరు సంపాదించుకున్న అర్వింద్.. గత పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కూతురు కవితను నిజామాబాద్‌లో ఓడించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ వస్తున్నాడు. సందర్భం ఏదైనా, సమయం ఏదైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలపై విమర్శలు చేస్తే సహించని నైజం తనది అన్న మార్కులను పార్టీ నాయకత్వం వద్ద కొట్టేశాడు. కేసీఆర్ కుటుంబంపై అగ్రెసివ్‌గా ఉండే అర్వింద్ అనూహ్య నిర్ణయం తీసుకోవడం ఇటు టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ శ్రేణుల్లోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇకపై తాను కేసీఆర్‌ను పరుష పదజాలంతో విమర్శలు చేయబోనని శపథం చేశారు.
అసలు రీజన్ ఇదేనా?
కేసీఆర్ పేరు చెబితేనే చిటపటలాడిపోయే అర్వింద్ ఇలా అకస్మాత్తుగా మనసు మార్చుకోవడానికి కారణం ఏంటన్నది సర్వత్రా జరుగుతున్న చర్చ. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు అర్వింద్. ఇటీవలే బీజేపీ పార్టీ అతడికి కీలక బాధ్యతను సైతం అప్పగించింది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయగా దానికి కన్వీనర్‌గా అర్వింద్‌నే నియమించారు పార్టీ పెద్దలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై తాను కేసీఆర్‌ను పరుష పదజాలంతో విమర్శలు చేయను అనడం వెనుక ఏం జరిగి ఉంటుందన్న చర్చ ఎంపీ అభిమానుల్లో కలవరపాటుకు గురి చేస్తోందట. అయితే తాను తీవ్ర పదజాలం మాత్రమే ఉపయోగించనని అర్వింద్ చెప్పాడని, విమర్శలు కొనసాగుతాయని మరి కొంత మంది అభిమానులు చెబుతున్నప్పటికీ ఇంత సడెన్‌గా ఆయన ఈ మాటలు ఎందుకు అనాల్సి వచ్చిందనేదే ఇప్పుడు చర్చకు తావిస్తోంది. ఇటీవల జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో అర్వింద్‌కు గ్రామస్తుల నుండి నిరసన ఎదురైంది. ఆయన కారును గ్రామస్తులు దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగిన అనంతరం అర్వింద్ స్వరంలో మార్పు వచ్చిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ దాడి ఘటనపై బీజేపీ నేతలు సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు.
రాబోయే ఎన్నికల్లో తన సత్తా ఏంటో మరోసారి చాటాలని అర్వింద్ భావిస్తున్నారు. ఈసారి కూడా దాదాపుగా కవితపైనే పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఉంది. కానీ, కేసీఆర్‌ను తీవ్ర పదజాలంతో విమర్శించడం వల్ల మొదటికే మోసం వస్తుందని గ్రహించిన అర్వింద్ ఆ పద్ధతికి స్వస్తి పలికి హేతుబద్దమైన విమర్శలతో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అది తిరిగి సీఎంకే లబ్ది చేకూర్చుతుందనే అంచనాకు బీజేపీ వచ్చిందట. ఈ మేరకు పార్టీ పెద్దల నుండి రాష్ట్ర నేతలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని ఇకపై కేసీఆర్ కుటుంబాన్ని, వ్యక్తిగత అంశాలని టార్గెట్ చేసుకోవద్దనే సూచనలతోనే అర్వింద్‌లో ఈ మార్పుకు అవకాశం ఏర్పడిందనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.
తండ్రి బాట ఎటు?
మరో వైపు అర్వింద్ తండ్రి డి.శ్రీనివాస్ రాజకీయ పయణం ఎటువైపు అనేది ఇంకా అంతుచిక్కడం లేదు. మొన్నటి వరకు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్ పదవీ కాలం ముగిసిపోయింది. చాలా కాలంగా గులాబీ పార్టీతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ఆయన కాంగ్రెస్‌లో చేరిపోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓసారి కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయిన డీఎస్ ఎన్నికల సమయానికి హస్తం గూటికి చేరుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా యాక్టీవ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్న డీఎస్ కాంగ్రెస్‌లో చేరితే అది అర్వింద్‌కు ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా పొలిటికల్ కారిడార్‌లో జోరుగా సాగుతోంది. సో.. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన వ్యూహాలతో చక్రం తిప్పిన డీఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతున్న క్రమంలో కేసీఆర్ విషయంలో అర్వింద్ తీసుకున్న నిర్ణయం అతడి అభిమానులకు నిరాశకు గురి చేస్తోందట. అర్వింద్‌తో సత్సంబంధాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్న తీన్మార్ మల్లన్న సైతం ఇకపై తాను సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా తూలనాడబోనని గతంలో శపథం చేసిన సంగతి గమనార్హం.
ఇది కూడా చదవండి: భద్రాచలంపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..
- Tags
- MP Arvind