Nitin Gupta: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్‌గా నితిన్ గుప్తా!

by Manoj |   ( Updated:2023-09-01 08:24:04.0  )
Nitin Gupta: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్‌గా నితిన్ గుప్తా!
X

న్యూఢిల్లీ: Nitin Gupta Appointed As Central Board Of Direct Taxes Chairman| కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త ఛైర్మన్‌గా ఐఆర్ఎస్ అధికారి నితిన్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర యూనియన్ కేబినెట్ నితిన్ గుప్తా నియామకాన్ని ఖరారు చేసింది. ఆదాయపు పన్ను కేడర్‌కు చెందిన నితిన్ 1986 బ్యాచ్‌ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ విభాగంలో ఇన్వెస్టిగేషన్‌ అధికారిగా పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ కానున్నారు.

గత వారాంతం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, సీబీడీటీ ఛైర్మన్‌గా నితిన్ గుప్తాను నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించింది. ఇదివరకు ఛైర్మన్ బాధ్యతలు నిర్వహించిన జేబీ మహపాత్ర ప్రస్తుత ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత సీబీడీటీ బాస్ పదవిని బోర్డు సభ్యుడు, 1986 బ్యాచ్‌కి చెందిన ఐఆర్ఎస్ అధికారి సంగీతా సింగ్ అదనపు హోదాలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బోర్డులో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో 1985 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అనూజా సారంగి అత్యంత సీఇనియర్‌గా ఉన్నారు. ఇక ప్రగ్యా సహాయ్ సక్సెనా, సుబశ్రీ అనంతకృష్ణన్ ఇద్దరూ ఐఆర్ఎస్ 1987 బ్యాచ్‌కి చెందినవారు.

Advertisement

Next Story

Most Viewed