ఆమె కోసం క్యూ కడుతున్న యంగ్ హీరోలు.. ఎందుకో తెలుసా?

by Satheesh |
ఆమె కోసం క్యూ కడుతున్న యంగ్ హీరోలు.. ఎందుకో తెలుసా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం 'మాచర్ల నియోజకవర్గం' పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న స్టార్ యాక్టర్.. ఈ మూవీ తర్వాత వక్కంతం వంశీతో మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తోంది. ఇప్పటికే కాస్టింగ్ పనులు పూర్తిచేసిన డైరెక్టర్ వంశీ.. ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ 'శ్రీ లీల'ను ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తోంది. త్వర‌లోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రక‌ట‌న వచ్చే అవకాశం ఉండగా.. ఈ చిత్రానికి 'జూనియ‌ర్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story